- ఉల్లి పేస్ట్ గురించి మనకు తెలిసిందే. శాకాహారం ,మాంసాహార ఆహార పదార్థాల తయారీలో ఉల్లి పేస్టు ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
- చాలామంది ఉల్లిపాయలు కొనుగోలు చేసి పైపొరను కింద వేస్ట్ తొలగించి ఉల్లి పేస్టు తయారు చేసి వంటల్లో వినియోగిస్తారు. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్ లో ఎంత సమయం కేటాయించడం లేదు.
- రెడీమేడ్ ఆనియన్ పేస్టు ని కొనుగోలు చేసి ఇంటి వంటల్లో, ఫంక్షన్లో ,హోటల్లో ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
- ఇందుకు కారణం ఒక్కొక్కసారి ఉల్లి ధరలు ఆకాశాన్ని అందుకుంటాయి .సామాన్యులకు అందుబాటు ధరలో ఉండవు. మార్కెట్లో ఒక్కోసారి నాణ్యమైన ఉల్లిపాయలు దొరకవు. ఇంకా ఈ ఉల్లిపాయలు తొక్క తీయడం కట్ చేయడం కళ్ళు మండి కళ్ళ నుండి నీరు కారడం వంటి ఇబ్బందులు ఉండడంవల్ల ఇప్పుడు అందరూ ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ ని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
- ఈ రెడీమేడ్ ఆనియన్ టెస్ట్ 18 నెలలు నిల్వ ఉంటుంది. కాబట్టి ఒక్క సారి కొనుగోలు చేస్తే పాడైపోతుందని భయం లేదు. రుచిలో తేడా ఉండదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ తయారీని ఇంటివద్ద ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించవచ్చు.
- Requirements:-
- ముఖ్యంగా ఈ బిజినెస్ లో ఆనియన్ పేస్ట్ మేకింగ్ మెషిన్ కావాల్సి ఉంటుంది.
- ఈ మెషిన్ ధర రూ.10,000/-ల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మిషన్ ఇండియా మార్ట్.com వంటి ఈ- కామర్స్ వెబ్ సైట్లలో లభ్యమవుతాయి.
- రిఫైన్డ్ ఆయిల్, ఆనియన్స్, అల్లం-వెల్లుల్లి, కడాయి, ప్యాకింగ్ పౌచులు కావాలి.
- తయారు చేసే విధానం:-
- ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ లో మూడు రకాలు ఉంటాయి. అందులో1) ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్2) బాయిల్డ్ ఆనియన్ పేస్ట్3) ఆనియన్ మసాలా గ్రేవీ పేస్ట్.
- తాజా ఆనియన్స్ ని తీసుకొని ఫైబర్ ని కింద పేస్ట్ ని తీసేసి10-15mm సైజులో కట్ చేసి వంట నూనెలో వేయించాలి.
- ఆ తర్వాత ఆనియన్ మేకింగ్ మిషన్ సహాయంతో గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారవుతుంది.
- గాలి తగలకుండా ప్లాస్టిక్ పౌచ్ లో ప్యాకింగ్ చేసుకోవాలి.
- ఆనియన్ మసాలా పేస్ట్ కి అల్లం, వెల్లుల్లి ,టమాటాలు కూడా నూనెలో వేయించి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి.
- ఉల్లి పేస్టు కలిపి ఇతర స్పైసెస్ మిక్స్ చేసి వేడిగా ఉన్నప్పుడే ప్యాకింగ్ చేసుకోవాలి.
- 250గ్రామ్స్,500 గ్రామ్స్,1kg,10kg లో గాని ఆనియన్ ప్యాకెట్స్ గా చేసుకోవాలి.
- ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ 18 నెలలు నిల్వ ఉంటుంది.
- పెట్టుబడి -ఆదాయం -ఖర్చులు:-
- ఈ బిజినెస్ పెట్టుబడిరూ.30,000/- లతో మనం ఇంటి వద్ద ప్రారంభించవచ్చు.
- ప్రస్తుతం ఒక కేజీ ఆనియన్స్ రూ.30-50/- లు ఉంది.
- మార్కెట్లో ఒక కేజీ ఆనియన్ పేస్ట్ రూ.200/- లు పైనే ఉంది.
- మీరు హోల్ సేల్ ధరలలో ఒక కేజీ ఆనియన్ పేస్ట్ రూ.150/- లకు అమ్మిన ఒక కేజీ పేస్ట్ పై అన్ని ఖర్చులు పోను సుమారు రూ.100/- లు మిగులుతుంది.
- రోజుకు 20 కేజీల రెడీమేడ్ ఆనియన్ వేస్ట్ సేల్ చేసుకుంటే రోజుకు రూ.2,000/- వరకు వస్తుంది.
- ఒక నెలకు 60,000/-లు సంపాదించుకోవచ్చు.
- ఈ బిజినెస్ కి fssai ఫుడ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది.
- మార్కెటింగ్:-
- మార్కెటింగ్ కొరకు లోకంలో ఉన్న జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల సేల్ చేసుకోవాలి.
354 total views, 2 views today