మంచి డిమాండ్ ఉన్న తక్కువ పెట్టుబడి తో చేయగల బిజినెస్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం.
ఫుడ్,స్నాక్స్ కి మన ఇండియాలో చాలా డిమాండ్ ఉంది.మన దేశంలో స్నాక్స్ ఐటమ్ అనగానే గుర్తుకు వచ్చేది. మిర్చి, బజ్జి ,సమోసా, పునుగులు అనేది .అయితే వీటన్నింటి కంటే చాలా వెరైటీ గా ఉండే స్నాక్స్ ఐటమ్.
స్నాక్స్ అంటే ఎవరికి నచ్చదు. అందులో ఈ కుర్ర కారం అంటే అంత ఇష్టంగా తింటున్న స్నాక్స్ ఐటమ్ స్ప్రింగ్ రోల్. ఈ స్ప్రింగ్ రోల్ చాలా స్పైసీగా క్రిస్పీగా ఉంటుంది.
స్ప్రింగ్ రోల్ స్టాల్ బిజినెస్ మంచి స్వయం ఉపాధి మార్గం చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు. ఎంతో సులభంగా వీటిని తయారు చేసి వాటితో వ్యాపారం ఏ విధంగా ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్ప్రింగ్ రోల్ బిజినెస్ కావలసిన ఐటమ్స్:-
వీటిలో మనకు ప్రధానంగా కావాల్సింది స్ప్రింగ్ రోల్ షీట్స్ ఇవి మనకు ఆన్లైన్ లో లభిస్తాయి. లేదనుకుంటే వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఆన్లైన్లో8×8 స్ప్రింగ్ రోల్ షీట్స్70/-₹లకు లభిస్తున్నాయి.
మనమే స్వయంగా స్ప్రింగ్ రోల్స్ షీట్లను తయారు చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది.
ఈ స్ప్రింగ్ రోల్ తయారు చేసే మిషనరీ చాలా తక్కువ ధరకే మనకు ఆన్లైన్లో లభిస్తుంది.
వీటి ధర మనకు 800-1200/-లలో లభిస్తున్నాయి.
amazon, flipkart, ఇండియా మార్ట్ లో లభ్యమవుతున్నాయి.
ఈ స్ప్రింగ్ రోల్స్ స్టాల్ కోసం మనకు కు వెజ్ ,నాన్వెజ్ తయారుచేసుకోవాలి.
దీనినే స్ప్రింగ్ రోల్ మేకర్ అని అంటారు.
వెజ్ స్ప్రింగ్ రోల్స్ కోసం బంగాళదుంపలు, క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్ లేదా ఇతర కూరగాయలు వాడుకోవాల్సి ఉంటుంది.
నాన్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ కోసం చికెన్, ఎగ్ ,ఫిష్ ,ఫ్రాన్స్ వాడుకోవాల్సి ఉంటుంది.
స్ప్రింగ్ రోల్ స్టఫింగ్ మిషిన్ చాలా ఈజీ గా వాడుకోవచ్చు.
డి ఫ్రై కోసం ఫ్లయింగ్ మిషిన్, పామాయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ వాడాల్సి ఉంటుంది.
రోల్ ప్రిపేర్ చేసుకునేందుకు గ్యాస్ స్టవ్, కడాయి కూర్చోడానికి కుర్చీలు ,టేబుల్స్ కొనుగోలు చేసుకోవాలి.
తయారు చేసే విధానం:-
ముందు విట్ షీట్స్ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తరువాత ఒక పీస్ ని స్ప్రింగ్ రోల్ మేకర్ లో పెట్టి ఇ లోపలికి ప్రెస్ చేయాలి.
అలా ప్రెస్ చేసిన దానిలో కొద్ది గా స్టఫింగ్ ని పెట్టాలి. అప్లై వీటి యొక్క ends ని నీటితో తడపాలి. ఇలా చేయడం వల్ల రోల్ తయారయిన తరువాత సరిగ్గా అతుక్కుంటుంది.
నీటిని అప్లై చేసిన తర్వాత రూల్స్ మేకర్ పైన ఉన్న స్లైడర్ ని గట్టిగా లాగాలి. ఇలా లాగడం వల్ల స్టఫ్ మొత్తం విట్ షీట్ లోపలికి వెళ్లి రోల్ లాగా తయారయ్యి బయటకి వస్తుంది.
బయటకి వచ్చిన దానిని ఒకసారి ends కరెక్ట్ గా ఉన్నాయో, లేవో చెక్ చేసుకోవాలి.ఆ తర్వాత వేడి నూనెలో వేయాలి.బాగా ఫ్రై అయ్యాక బయటకు తీసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది.
ఆదాయం:-
ఒక స్ప్రింగ్ రోల్ తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు దాదాపు5/-₹మాత్రమే.
మనం మనం మార్కెట్లో లో ఒక కస్టమర్కు 8 రోల్ సప్లై చేస్తే అందుకు రూ 100/-లు ఛార్జ్ చేస్తున్నారు.
అయితే ఖర్చు మాత్రం 40/-₹మాత్రమే.
ఒక ప్లేట్ కు 60/-లు దాకా లాభం వస్తుంది.
ఒక రోజుకు 60 ప్లేట్లు మనం అమ్మిన నా దాదాపు ఒక రోజుకు 3600/- దాకా ఆదాయం వస్తుంది.
ఇక ఈ బిజినెస్ లో అత్యంత ప్రమాణ మైనవి. నాణ్యత, పరిశుభ్రత వీటిని పాటిస్తే చాలు జనం ఆటోమేటిగ్గా వస్తారు.
మార్కెటింగ్:-
ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మంచి రద్దీగా ఉన్న చోట లేదా కాలేజ్,మాల్స్,క్యాంటీన్లు కావాల్సి ఉంటుంది. లేదా బస్టాండ్, రైల్వే స్టేషన్ లు గాని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి చిన్న షాప్ లేదా ఫుడ్ స్టాల్ రెంట్ కి తీసుకోవాల్సి ఉంటుంది.
చిన్నపిల్లలు,కాలేజీ వాళ్ళు లేదా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం లో అయితే ఈ వ్యాపారానికి అనుకూలం.
ఈ బిజినెస్ fssai ఫుడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది
172 total views, 2 views today