మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
భారతదేశం అన్నపూర్ణ అంటారు.ఈ దేశం నదులు పంట పొలాలతో కళకళలాడుతూ ఉంటాయి.
మన తెలుగు రాష్ట్రంలో అందరూ పంటల లోనూ వరి ఎక్కువగా పండిస్తారు. ఒకప్పుడు వరిని బియ్యం గా మార్చడానికి పెద్ద పెద్ద రైస్ మిల్లు ఉండేవి. ఆప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉండేవి.పల్లెటూర్లలో పండించే వరిని పట్టణాలకు తీసుకువచ్చి రైస్ మిల్లులో బియ్యము గా పట్టించేవారు. అయితే ఇప్పుడు ఈ రైస్ మిల్లు నే మినీ రైస్ మిల్ లా ఊర్లోనే కాకుండా మీ ఇంటిలో కూడా ఒక గదిలో ఉంచి దీనిని వాడవచ్చు. ఇది ఒక పార్ట్ టైం బిజినెస్ లా తక్కువ ఖర్చు తోటి స్వయం ఉపాధి పొందవచ్చు.మీ ఊరిలో వాళ్లకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మినీ రైస్ మిల్ ఆపరేట్ చేయడానికి పెద్ద పెద్ద experience వాళ్ళు ఏమి అవసరం లేదు. ఈ మిషిన్ ఎవరైనా ఆపరేట్ చేయవచ్చు .
అయితే ఈ మిషన్ ధర ఎంత, ఎలా పనిచేస్తుంది, పెట్టుబడి లాభాలు ఇలా అన్ని విషయాలను తెలుసుకుందాం.
మినీ రైస్ మిల్ ఖరీదు 25000 రూపాయల నుండి 50 వేల రూపాయలకు వరకు ఉంటుంది అంతకు మించి కూడా ధర ఉంటుంది.ఇలా ఎందుకు మిషన్ ధర ఎక్కువ తక్కువ అంటే మిషిన్ కెపాసిటీ బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ 20 వేల రూపాయలు మిషన్ తీసుకుంటే 100 నుండి 120 కేజీల వడ్లను బియ్యం గా మార్చవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఒక యాభై వేల రూపాయల లోపు మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మిషన్ 3 Hp మోటార్ సహాయంతో పనిచేస్తుంది.ఏ మోటార్ అయినా ఇంటికి వాడే కరెంటుతో పని చేస్తుంది.ఈ మిషన్ గురించి ఆన్లైన్ లో search చేస్తే వారితో కాంట్రాక్ట్ అయ్యి మిషన్ ఖరీదు, మిషన్ వారంటీ గురించి తెలుసుకోవచ్చు .ఒకవేళ మిషిన్ రిపేర్ వస్తే ఎలా అని ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిజినెస్ start చేయండి. ఈ మిషన్ యొక్క లాభాలు ఖరీదు గురించి తెలుసుకుందాం. మిషన్ ఖరీదు 50000 అనుకుంటే మిషన్ కెపాసిటీ 100 నుండి 200 కేజీలు ఒక గంటకు వరిని బియ్యంలా మారుస్తోంది. ఒక్క కేజీ వడ్లను బియ్యం గా చేయడానికి ఒక కేజీకి ఒక రూపాయి తీసుకున్న 200 రూపాయలు వస్తుంది. మనం ఒక గంట మిషిన్ Run చేస్తే మనకు వంద రూపాయలు ఆదాయం వస్తుంది. రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు మరియు ఇతర ఛార్జీలు గంటకు 20 రూపాయలు తీసివేసిన 200-20=180 రూపాయలు
లాభం అంటే రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే Rs180×8= 1440 ఇలా నెలకు రూపాయలు 40000 నుండి 50000 ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ వరిని బియ్యం మార్చుకోవడానికి కాకుండా వేరే విధముగా..
ఈ మిషన్ వరిని బియ్యం లా మార్చుకోవడానికి కాకుండా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఇది ఒక విధంగా Multifunctional machine.
ఈ మిషన్ ఎలా అంటే వరి లో నుండి బియ్యంనీ కాకుండా అనేక రకాలు పొడులను కూడా మసాలా లుగా ప్యాకింగ్ చేసి అమ్ముకోవచ్చు.
405 total views, 2 views today