Poly Ethylene Terephthalate(PET) ఇది పాలిమర్ రంగంలో ఉన్న అనేక రకాల ప్లాస్టిక్ లలో ఒకటి.ఉత్పత్తి ప్యాకేజీ రంగంలో PET ఆవిర్భావం విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వచ్చింది అని చెప్పవచ్చు. మొత్తం PET బాటిల్స్ వినియోగంలో 21 శాతం నీటి ప్యాకింగ్ 11% కార్బొనేటెడ్ డ్రింక్స్ 14% మత్తు పానీయాలు 15% ఆరోగ్య ఉత్పత్తులు 8% వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు 6 ఫ్లేవర్ శీతల పానీయాలు ఐదు శాతం వంట నూనె రెండు శాతం వ్యవసాయ రంగంలో రసాయనాల ప్యాకింగ్ 18 శాతం ఇతర ఉత్పత్తి ప్యాకింగ్ కి ఉపయోగిస్తారు. బాటిల్స్ రూపంలో మార్కెట్ కి వెళ్తున్నా PET మొత్తం పరిమాణంలో 70 శాతం వరకు రీసైక్లింగ్ చేస్తూ ఇతర ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తున్నారు. అయినా దేశం మొత్తం మీద ఏటా దాదాపు మూడు వందల యాభై లక్షల టన్నుల PET బాటిల్స్ రీసైక్లింగ్ కావడంలేదు అదే వివిధ రకాలుగా పర్యావరణానికి హాని కలిగిస్తుందని చెప్పవచ్చు.SO మనం వాడి పారేసిన పాత PET బాటిల్స్ ని రీసైక్లింగ్ చేస్తూ మంచి లాభార్జన చేయవచ్చు. ఈ పరిశ్రమ స్వయం ఉపాధి కాగలదు.
యంత్ర పరికరాలు:-
1) బెల్ట్ కన్వేయర్స్ 2)లేబుల్స్ రిమూవర్ 3) క్రషర్ 4) స్క్రూ లోడర్ 5) హాట్ వాషర్ 6) పైప్ డ్రయ్యార్ 7) గ్రాన్యూల్స్ మేకింగ్ మిషన్ 8) ఇతర పరికరాలు
ఈ పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలు
1)స్క్రాప్ పెట్ బాటిల్స్ 2) ప్యాకింగ్ బ్యాగులు
రీసైక్లింగ్ విధానం:-
ముందుగా మనం పాత పెట్ బాటిల్స్ ని కలర్ ను బట్టి వేరు చేసి వాటిని లేబుల్ ను తీసి వేయాలి. ఆ బాటిల్స్ ను క్రషర్ మిషన్ లో వేయాలి. క్రషర్ ఆ బాటిల్స్ ను పెద్ద సైజు ముక్కలుగా చేస్తుంది . ఈ పెట్ ప్లాస్టిక్ పెద్ద సైజు ముక్కలను స్క్రూ లోడర్ మెషిన్ లో వేసి మరింత చిన్న ముక్కలు (ప్లేక్స్) గా చేయాలి. ఈ ఫ్లెక్స్ ను అనేకసార్లు శుభ్రపరిచి ఆరబెట్టాలి. ఇది ప్రైమరీ స్టేజ్ గా చెప్పవచ్చు.ఈ ఫ్లెక్స్ ను గ్రాన్యూవల్స్ మేకింగ్ మిషన్ లో వేయాలి. ఈ మిషన్ ఫ్లెక్స్ ను అధిక ఉష్ణోగ్రత తో వేడిచేసి నూడిల్స్ వంటి ఆకారంలో సన్నని దారాలుగా, నీటి గుండా బయటకు వస్తాయి. మెషిన్ కి ఉన్న గ్రాన్యూవల్స్ గా కట్ చేయాలి.
ఈ గ్రాన్యూవల్స్ ని వివిధ పెట్ ఉత్పత్తి తయారీలో వర్జిల్ గ్రాన్యూవెల్స్ తో కలిపి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ప్రైమరీ రీసైక్లింగ్ పెట్ ఫ్లెక్స్ తో ఫైబర్ ని తయారు చేస్తారు. ఆ పైబర్ ను ఫ్యాబ్రిక్స్ కార్పెట్స్ తయారీకి ఉపయోగిస్తారు.పెట్ పిల్స్, షీట్స్, స్త్రపర్ ఇతర అనేక ఉత్పత్తుల తయారీకి పెట్ ఫ్లెక్స్ గ్రానువల్ ను వినియోగిస్తున్నారు. అందువల్ల రీసైక్లింగ్ పెట్ ఫ్లెక్స్ కు మార్కెట్ సమస్య ఉండదని చెప్పవచ్చు.
ఆదాయం- ఖర్చులు:-
రిసైకిల్ వైట్ పెట్ ప్లేక్స్ ధర – ₹ 53/- kg
రిసైకిల్ గ్రీన్ పెట్ ప్లేక్స్ ధర – ₹ 40/- kg
అన్ని ఖర్చులు పోను కేజీ వైట్ పెట్ ఫ్లెక్స్ సుమారు రూ.7/- కేజీ గ్రీన్ పెట్ ప్లేక్స్ కు సుమారు రూ.2/- లాభం వుంటుంది.
రిసైకిల్ పెట్ గ్రాన్యూల్స్ మార్కెట్ ధర -రూ.80/-నుంచి 85/- కేజీ అన్ని ఖర్చులు పోను కేజీ గ్రాన్యూల్స్ కు సుమారు రూ. 15 – 20 /-వరకు లాభం వస్తుంది.
మార్కెటింగ్:-
మీరు తయారు చేసి ప్లాస్టిక్ ఫ్లెక్స్ గ్రానువల్స్ మార్కెటింగ్ కొరకు ఫైబర్ ఐటమ్స్ పెట్ ఫిలిప్స్ షీట్స్ స్త్రపర్ వంటి ప్రొడక్టు తయారుచేసే పరిశ్రమలు సంప్రదించాలి.ఇంకా india mart. com, trade india. com వంటి వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి వీటిని అమ్ముకోవచ్చు. ఇంకా ఈ రీసైక్లింగ్ కొనేవారు కి wholesale గా అమ్మాలి.
లైసెన్స్-లోన్స్-సబ్సిడీ:-
ఇంకా మనం స్థానికంగా అధికారుల నుంచి TRADE LICENCE అవసరం. ప్రస్తుతం GST నమోదు తప్పనిసరి. ఇంకా బ్యాంకు లోను కోసం మీరు కానీ బిజినెస్ కన్సల్టెంట్స్ ద్వారా మీరు ప్రారంభించే పరిశ్రమ యొక్క project Report తయారు చేసుకొని లోకల్ బ్యాంకులో సంప్రదించాలి.MSME UDYOG ADHAR సబ్సిడీ చేసుకోవాలి.
662 total views, 2 views today